డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు.లైగర్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న పూరికి డబుల్ ఇస్మార్ట్ మూవీ సక్సెస్ ఎంతో కీలకంగా మారింది.ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ లో పూరి బిజీ గా వున్నారు..అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే పూరి గత కొన్నాళ్లుగా యూట్యూబ్లో పూరి మ్యూజింగ్స్ పేరుతో పలు అంశాల మీద తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి విషయం గురించి పూరి చర్చిస్తూ వుంటారు. తాజాగా అవమానం గురించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
“జీవితంలో ప్రతి వ్యక్తి అవమానానికి గురవుతుంటాడు.ఈ సొసైటీ లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదోక మాట అంటూనే వుంటారు.అయితే ఆ సమయంలో మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి అవమానాలు ఎదురైనప్పుడు బాధపడకూడదు. అప్పుడే మనం ఎంతో హుందాగా ఉండాలి. అస్సలు వారు మనల్నిఎందుకు అవమానించారో అర్థం చేసుకోండి. ఏ సందర్భంలో అది జరిగిందో అర్థం చేసుకోండి. ఎవరు నిన్ను అవమానించారు ? నిన్ను అమితంగా ప్రేమించే వ్యక్తా ?.. నీ స్నేహితుడా..? నీ శత్రువా..? ఎవరైనా కావచ్చు కానీ వారు ఏ ఉద్దేశంతో నిన్ను అవమానించారు ? నిన్ను ఎక్కడ అవమానించారు ? పబ్లిక్ ప్లేస్ లోనా.. ? సోషల్ మీడియాలోనా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్పందించాలి.మీకు అవమానం జరిగిన సమయంలో పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మౌనంగా ఉండండి. ఎందుకంటే నిన్ను అవతలి వ్యక్తి కావాలనే అవమానిస్తాడు. దానికి నువ్వు వెంటనే కోప్పడితే ఎదుటివాడు గెలిచినట్టే. దాన్ని ఆసరాగా తీసుకోని నిన్ను ఇంకా రెచ్చగొడతాడు. అలాంటప్పుడే మనం హ్యూమర్ వాడాలి. అది పవర్ ఫుల్ వెపన్..మన చిరునవ్వు వాడిని మనం సీరియస్ గా తీసుకోలేదని వాడికి తెలియాలి. ఎంతటి అవమానం జరిగిన దానికి మీ చిరునవ్వే సమాధానం కావాలి..అని పూరి తెలిపారు.