NTV Telugu Site icon

Kollywood : తన పేరు నుండి తండ్రి పేరు తీసేసిన యంగ్ హీరో

Dhruv

Dhruv

విక్రమ్ స్టార్ హీరోగా మారడానికి ఎన్నో ఒడిదుకులు ఎదుర్కొన్నాడు. ఎన్నో సినిమాలు, ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ రాలేదు ఈ స్టార్ డమ్. తెలుగు, తమిళం, మలయాళంలో ఆయనకు  ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్ విక్రమ్. విజయ్ దేవరకొండ కల్ట్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్‌తో హీరోగా ఆదిత్య వర్మ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మెరుపులు క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ వల్ల ఛాన్సులు రాలేదు. దీంతో తండ్రితో కలిసి మహాన్ చేశాడు. ఇది ఓకే అనిపించుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో మూవీ ఆడలేదు. ఇక మధ్య మధ్యలో తనలో దాగి ఉన్న సింగర్ కు పని చెప్పాడు ధ్రువ్. హాయ్ నాన్నలో ఓడియమ్మ సాంగ్ తెలుగులో కూడా పాడి ఆశ్చర్యపరిచాడు ధ్రువ్.

Also Read : Tollywood : నిర్మాతలకు గుదిబండలా మారుతున్న డాన్సర్లు

ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమా చేస్తున్నాడు ధృవ్. దాదాపు మూడేళ్ల తర్వాత ‘బైసన్’ మూవీతో వస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ బాయ్. వాజై తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రాజెక్టుపై అంచనాలు ఏర్పడ్డాయి. తంగలాన్ దర్శకుడు పా రంజిత్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. రీసెంట్లీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డిఫరెంట్ లుక్కులో కనిపస్తున్నాడు ధ్రువ్. అలాగే ఇప్పటి వరకు ధ్రువ్ తన తండ్రి పేరును క్యారీ చేయగా ఇప్పుడు ఆ పేరును తొలగించాడు. జస్ట్ ధ్రువ్ అని మాత్రమే మెన్షన్ చేశారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో అందాల అనుపమ హీరోయిన్‌గా నటిస్తోంది. నెపో కిడ్ పేరు నుండి దూరం జరిగేందుకు ఫాదర్ నేమ్ తొలగించిన ధ్రువ్ మరీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడో లేదో  ‘బైసన్’ రిలీజ్ వరకు ఎదురుచూడాలి.