ప్రస్తుతానికి భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు సినిమాని గాని నటులను కానీ ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. అందులో భాగంగా మన తెలుగులో రూపొందిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయి మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. అలాగే ఇతర భాషల్లో రూపొందిన ఎన్నో తెలుగులో కూడా డబ్బింగ్ అయి పేరు తెచ్చుకుంటున్నాయి. ఇక తాజాగా మన తెలుగు హీరో ఒక పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ మీద హేమలత, ఉదయకుమార్ నిర్మించిన 4 లెటర్స్ సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు 2019లో హీరోగా ఈశ్వర ప్రసాద్ పరిచయమయ్యాడు.
ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆయన వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈశ్వర్ ప్రసాద్ తిరుపతికి చెందిన వ్యక్తి. సినిమాల మీద ఉన్న ఇష్టంతో తెలుగు సినీ పరిశ్రమ లోకి వచ్చిన ఆయన ఫోర్ లెటర్స్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్న ఈశ్వర్ ప్రసాద్ సామాజిక సేవతో కూడా ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇక ఆయన తన పుట్టినరోజు సందర్భంగా ఒక పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. భారీ బడ్జెట్ తో రూపంతో పోతున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.