సోలో హీరోగా ‘మనం మనం బరం పురం’ సినిమా ఆగిపోవడంతో మల్టీస్టారర్ సినిమాలకు జై కొట్టాడు మంచు మనోజ్. ఆ నేపధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారారోహిత్ తో కలిసి భైరవం అనే సినిమాలో నటించాడు. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ కానీ కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాతో పాటు తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు మనోజ్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Also Read : #Single : శ్రీ విష్ణు #సింగిల్ ఓవర్సీస్ టాక్
ఇవి రెండు కాకుండా ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు మనోజ్. కొన్నీళ్ల క్రితం కార్తికేయ హీరోగా 90 ML అనే సినిమాను డైరెక్ట్ చేసిన శేఖర్ రెడ్డి మనోజ్ కు కలిసి ఓ కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మనోజ్. అలాగే ఈ సినిమాకు ‘అత్తరు సాయిబు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. టైటిల్ ను బట్టి చూస్తే ఇదేదో డిఫ్రెంట్ కథ, కథనం అనిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ ఈ కథను మలిచాడట దర్శకుడు శేఖర్. ఈ సినిమాను ఓ యంగ్ ప్రొడ్యూసర్ నిర్మించనున్నాడట. త్వరలోనే ఏ సినిమాకు సంబందించి అధికారక ప్రకటన కూడా రానుందని సమాచారం. మొత్తానికి చాలా కాలం తర్వాత మనోజ్ హీరోగా రాబోతున్న అత్తరు సాయిబుతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.
