మాస్ మహారాజ రవితేజ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్ లోచేసిన మాస్ జాతర మరికొన్నిగంటల్లో ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇటీవల ఫ్యాన్స్ ను బాగా డిజప్పోయింట్ చేశాను ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాన్ఫిడెంట్ గా చెప్పాడు రవితేజ. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
Also Read : Lucky Actress : ముగ్గురు ప్లాప్ హీరోలకు హిట్స్ హీరోయిన్.. ఇంతకీ ఎవరా భామ?
ఇదిలా ఉండగా రవితేజ నెక్ట్స్ సినిమాలు లైనప్ ఇప్పటి యంగ్ హీరోలకు కూడా లేదని చెప్పాలి. మాస్ జాతర చేస్తూనే నేను శైలాజ దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్టన్ లో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమాను కూడా ఒకే చేసాడు. ఆ తర్వాత మ్యాడ్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మాహారాజ. ఈ మూడు సినిమాలతో పాటు దర్శకుడు త్రినాథరావు నక్కిన ఆస్థాన రైటర్ గా ఎన్నో సినిమాలకు రైటర్ గా పనిచేసిన బెజవాడ ప్రసన్న మాస్ రాజా కోసం ఓ కథ రెడీ చేసాడు. ఇటీవల మాస్ మహారాజను కలిసిపాయింట్ వినిపించగా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. ఇక మాస్ రాజా కెరీర్ లో 80వ సినిమాగా బింబిసార, విశ్వంభర సినిమాల దర్శకుడు వసిష్ఠ డైరెక్షన్ లో సినిమా రానుందట. ఈ సినిమా ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు సమాచారం. ఇలా ఏకంగా ఆరు సినిమాలను లైనప్ చేసి ఉంచాడు మాస్ మహారాజ్.
