Site icon NTV Telugu

Yedu-Tarala-Yuddham : తెలంగాణ విమోచన దినోత్సవం నాడు ‘ఏడు తరాల యుద్ధం’ అనౌన్స్మెంట్

Yedu Payala Yudham

Yedu Payala Yudham

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఒక శక్తివంతమైన హిస్టారికల్ సినిమా ప్రకటించబడింది. మేకర్స్ ఈ ప్రత్యేక రోజునే “ఏడు తరాల యుద్ధం” అనే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్ ఇప్పటికే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

Also Read : Manchu Manoj: హీరోల కొడుకు‌లే కాదు.. ఎవరైనా హీరోలు కావొచ్చు

ఈ సినిమా 1948 సమయంలో నిజాం చివరి తరంతో తెలంగాణలో జరిగిన విప్లవ పోరాటాల నేపథ్యాన్ని చూపించబోతోంది. స్వేచ్ఛ కోసం, గౌరవం కోసం మగవారు, ఆడవారు, రైతులు ప్రాణాలు పణంగా పెట్టి చేసిన యుద్ధమే ఈ కథకు మూలం. ప్రజల ఆత్మగౌరవం, త్యాగం, ధైర్యసాహసాలను ఈ చిత్రంలో ప్రతిబింబించనున్నారు. దర్శకుడు బొమ్మ వేణు గౌడ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడమే కాకుండా ఎడిటింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు కూడా స్వయంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకి సుభాష్ ఆనంద్ సంగీతం అందించబోతున్నారు. హిస్టారికల్ డ్రామాలకు తగిన రీతిలో బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మేకర్స్ మాటల ప్రకారం, “ఏడు తరాల యుద్ధం” కేవలం సినిమా మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు తెలంగాణ పోరాట గాథను గుర్తుండిపోయేలా చెబుతున్న ఓ విజువల్ ట్రీట్ అవుతుంది. 1948లో తెలంగాణలో రగిలిన ఆవేశం తెరపై చూపించబోతున్న అని తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఒక గొప్ప చరిత్రను మరోసారి గుర్తు చేయబోతున్న ఈ చిత్రం మీద ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Exit mobile version