ఈ ఏడాది ‘ఆర్టికల్ 370’ లాంటి శక్తివంతమైన సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్. గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన కథాంశాలతో ఆకట్టుకుంటోంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రాల కన్నా, కంటెంట్ ప్రధానమైన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. ఇక ఇక ప్రస్తుతం ‘దురందర్’ అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న యామీ, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఎంపిక చేసే విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Also Read : Chiranjeevi : ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
‘నేను ఎప్పుడూ నిర్మాతలకు ఒక్కటే చెప్తుంటాను. కథను చెబితే వినడం కన్నా చదవడానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. స్క్రిప్ట్ రాయబడిన విధానం వల్ల ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పాత్ర బలంగా అనిపిస్తే స్క్రిప్ట్ మొత్తం చదవకుండానే ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. కానీ నేను ఒకసారి ఓ పాత్రకు కమిట్ అయితే, దాని మీద పూర్తిగా ఫోకస్ పెడతాను. షూటింగ్ సమయంలో సామాజిక మాధ్యమాల నుంచి చాలా దూరంగా ఉంటాను. ఫోన్‌లో కూడా సమయం గడపను. నా పాత్రకు వందశాతం న్యాయం చేయడమే నా లక్ష్యం’ అని చెప్పుకొచ్చింది యామీ. వాస్తవానికి, పాత్రలో అంతగా ఒదిగిపోయే నటీమణులు అరుదు. యామీ గౌతమ్ మాత్రం ప్రేక్షకుల్ని కథతో పాటు తన నటనతో మాయ చేస్తుంది.
