కంగనా రనౌత్ కాపీ రైట్స్ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. కంగనా నెక్స్ట్ మూవీ ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’. ఈ సంవత్సరం ప్రారంభంలో నిర్మాత కమల్ జైన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో కంగనా రనౌత్‌తో కలిసి ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. మెహమూద్ ఘజ్నవిని రెండుసార్లు ఓడించిన కాశ్మీర్ రాణి ‘దిడ్డా’ కథలో కంగనా కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా కాపీ రైట్స్ వివాదంలో చిక్కుకుంది. ‘దిడ్డా: ది వారియర్ క్వీన్ అఫ్ కాశ్మీర్’ పుస్తక రచయిత ఆశిష్ కౌల్ తన అనుమతి లేకుండా సినిమాను ప్రకటించినందుకు నటిపై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. కంగనా తన ట్వీట్ ద్వారా తన సినిమాను ప్రకటించేటప్పుడు తాను ఒక ఇమెయిల్ ద్వారా పంపిన ‘దిడ్డా: ది వారియర్ క్వీన్ ఆఫ్ కాశ్మీర్’ కథాంశంలో కొంత భాగాన్ని ఉపయోగించారని రచయిత కౌల్ ఆరోపించారు. ఈ కేసులో కంగనా రనౌత్‌కు కోర్టు ఉపశమనం ఇవ్వడాన్ని తాను వ్యతిరేకిస్తానని రచయిత స్పష్టం చేశారు. రచయిత ఆశిష్ కౌల్ కథకు ప్రత్యేకమైన కాపీరైట్ ఉందని పేర్కొన్నారు.
Read Also : సోదరులతో సల్మాన్ డ్యాన్స్… రేర్ వీడియో వైరల్
ఇక వారు వేసిన కేసును సవాలు చేస్తూ కంగనా, ఆమె సోదరి ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై రచయిత కౌల్ న్యాయవాదులు యోగితా జోషి, అమానీ ఖాన్ మాట్లాడుతూ “కంగనా రనౌత్ పాస్ పోర్ట్ కోసం ప్లీ దాఖలు చేసింది. కానీ బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టులో మా క్లయింట్ ఆశిష్ కౌల్ వేసిన కేసుతో పాటు మరొక కేసును దృష్టిలో ఉంచుకుని ఆమె పాస్ పోర్టును అధికారులు తిరస్కరించారని వెల్లడించారు”. ఈ కేసులో స్టేట్మెంట్ కోసం కంగనా రనౌత్ ఇంకా పోలీసుల ముందు హాజరుకాకపోవడంతో వారు నోటీసును మాఫీ చేశారని, ఏదైనా ఉపశమనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివరణాత్మక మరియు సమగ్రమైన జవాబును దాఖలు చేయనున్నట్లు న్యాయవాదులు తెలిపారు.
