NTV Telugu Site icon

UnstoppableS4 : బాలయ్య చేసే పండుగ సమయం వచ్చేసింది

Aha

Aha

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో తొలి మూడు సీజన్లు సూపర్ హిట్ గా నిలిచాయి. టాలీవుడ్ లి చెందిన ప్రముఖ నటి నటులు తమ తమ విషయాలను బాలయ్య తో పంచుకుని ఆడి పాడి అలరించారు. ఈ సూపర్ హిట్ టాక్ షో నాలుగో సీజన్ త్వరలో రాబోతుంది. అందుకు సంబంధించి అధికారకంగా భారీ ఈవెంట్ కూడా ఇటీవల నిర్వహించారు ఆహా మేకర్స్.

అందులో భాగంగా అన్‌స్టాపబుల్ నాలుగో సీజన్ సరికొత్త ప్రోమోని కూడా రిలీజ్ చేసారు. ఈ సారి బాలయ్య బాబుని సూపర్ హీరోగా అభివర్ణిస్తూ చేసిన ప్రోమో ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 కు సంబంధించి ప్రోమో మేకింగ్ వీడియోని ఆహా టీమ్ విడుదల చేసింది. బాలయ్య లుక్ ఎలా ఉండాలో. సూపర్ హీరోగా ఎలా చూపించాలో యూనిట్ డిస్కషన్స్ చేస్తూ బాలయ్యని ఎలా సూపర్ హీరోగా మార్చారు అని ఒక్కోటిగా బాలయ్య సినిమాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆసక్తిగా చూపించారు. త్వరలో స్ట్రీమింగ్ కానున్న సీజన్ – 4 కు కోసం ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ షూట్ చేసారు మేకర్స్. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్ టీమ్ కాఫ్ మరోటి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప – 2 మరోటి. మూడు ఎపిసోడ్ గా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో షూట్ చేయనున్నారు

Also Read : Rana : రామ్ గోపాల్ వర్మతో SS. రాజమౌళి షూటింగ్

Show comments