యువ హీరోయిన్ అనశ్వర రాజన్, టూరిస్ట్ ఫ్యామిలీ ఫెమ్ అభిషన్ జీవింత్ జంటగా నటిస్తున్న సినిమా ‘విత్ లవ్’. ఈ సినిమాని మదన్ ఎన్ దర్శకత్వం వహిస్తుండగా.. జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్‌పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పాసిలియన్ నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమాని ‘విత్ లవ్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ కూడా మేకర్స్ వదిలారు.
ఒక నిమిషం 27 సెకండ్ల నిడివి గల విత్ లవ్ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ‘ఏంటి మాయ్యా ఎలా ఉన్నావ్’ అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. ‘నేను ఎలా ఉంటే నీకేంట్ర బొచ్చుగా’, ‘నాక్కాబోయే పెళ్ళాంరా.. మూసుకుని అడిగింది చెప్పు’, ‘మౌనిషా మౌనిషా ఇలాంటి అన్ని పెట్టకు’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను తెచ్చుకుంటోంది. ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి చూపుతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీజర్‌లోని విజువల్స్, అనశ్వర-అభిషన్ మధ్య కెమిస్ట్రీ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచాయి.
Also Read: BCCI Central Contracts: గ్రేడ్‌లలో ఊహించని మార్పులు.. భారత క్రికెటర్ల జాబితా ఇదే!
సంగీత దర్శకుడు షాన్ రోల్డన్ విత్ లవ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రేమకథలకు ప్రాణం పోసే మెలోడీస్‌తో ప్రేక్షకుల హృదయాలను తాకేలా సంగీతం ఇచ్చారు. ఇప్పటికే తమ నటనతో యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అభిషాన్ జీవింత్, అనశ్వర రాజన్ కాంబినేషన్ ‘విత్ లవ్’పై అంచనాలను పెంచుతోంది. మొత్తంగా ప్రేమ, సంగీతం, కొత్తదనం కలబోసిన విత్ లవ్ సినిమా టైటిల్ టీజర్ తొలి చూపుతోనే మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
