కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. దాంతో తెలుగు నిర్మాతలు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ తో సలార్ ను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ ఇప్పడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా టాలీవుడ్ సెన్సేషన్ అవుతుందని టాక్ ఇన్ సైడ్ గా చర్చించుకుంటున్నారు.
Also Read : HHVM : మైత్రీ, దిల్ రాజు ఔట్.. నైజాంలో ఓన్ రిలీజ్ కు నిర్మాత రెడీ
ప్రశాంత్ నీల్ నెక్ట్స్ సినిమా ఎవరితో అనే డిస్కషన్ ఎప్పటి నుండో నడుస్తుంది. ప్రభాస్ తో చేసిన సలార్ కు సీక్వెల్ సలార్ పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా సలార్ 2 ఇప్పట్లో ఉండదని అంత అనుకున్నారు. అటు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో చేసే సినిమా అయ్యాక తమిళ్ హీరో అజిత్ కుమార్ తో సినిమా చేయబోతున్నాడు కేజీఎఫ్ కు సీక్వెల్ గా పార్ట్ 3ని డైరెక్ట్ చేస్తానని వార్తలు వచ్చాయి. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోను ఓ సినిమా చేయబోతున్నాడు అని కూడా వినిపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రశాంత్ నీల్ నెక్ట్స్ సినిమా ప్రభాస్ తోనే ఉండబోతుందట. సలార్ పార్ట్ 2ను ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్నాడు. ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకునేలా ప్లాన్ చేసుకోబోతున్నాడు. ఖాన్సార్ లో దేవ రూలింగ్ ను వెండితెరపై చూడబోతున్నామని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
