Site icon NTV Telugu

Circus: ‘సర్కస్’తో అయినా పూజా కి హిట్ దక్కేనా?

Untitled 2.psd

Untitled 2.psd

Circus: అతి తక్కువ కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న తారల్లో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజ ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న నటి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే 2022 మాత్రం అమ్మడికి ఏ మాత్రం కలసి రాలేదు. వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. దాంతో అమ్మాయిగారి ఆశలన్నీ రాబోయే ‘సర్కస్’ పైనే ఉన్నాయి. అందుకేనేమో మహేశ్, సల్మాన్ ఖాన్ సినిమాలతో పాటు ప్రకటనల కోసం కేటాయించిన కాల్షీట్స్ అన్నింటినీ కాదని ‘సర్కస్’ సినిమా ప్రమోషన్‌పై దృష్టి సారించింది. ఈ సినిమాలో రణ్‌ వీర్ సింగ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు.

Read also: Covid Restrictions: కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్నట్లు చైనా ప్రకటన

ఇక ఈ ఏడాది పూజా హేగ్డే ప్రభాస్ హీరోగా ‘రాధే శ్యామ్’, చిరంజీవి, రామ్ చరణ్‌ నటించిన ‘ఆచార్య’, విజయ్ ‘బీస్ట్’ సినిమాల్లో నటించింది. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాలను చవిచూశాయి. ఇవి కాకుండా అనిల్ రావిపూడి ‘ఎఫ్‌ 3’లో ఐటెమ్ నంబర్ కూడా చేసింది. ఆ పాట కూడా తనకి ఎలాంటి పేరు తెచ్చిపెట్టలేకపోయింది. ఈ ఏడాదిలో అమ్మడి చివరి సినిమా ‘సర్కస్’ సినిమానే. ఈ సినిమా విజయంపై పూజ బాలీవుడ్ భవిష్యత్ కూడా ఆధారపడి ఉంది. నటిగా తన ప్రయత్న లోపం లేకున్నా హిట్ పలకరించకపోవడంతో ఇప్పుడు పూజ రోహిత్ శెట్టి, రణ్‌ వీర్ నే నమ్ముకుని ఉంది. మరి ఈ కన్నడ కస్తూరి నమ్మకాన్ని ‘సర్కస్’ ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి.
Pushpa: పాన్ ఇండియా ‘పుష్ప’ రష్యాలోనూ ‘రైజ్’ అవుతుందా?

Exit mobile version