Site icon NTV Telugu

Salaar : ప్రభాస్ వాడిన బైక్ గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే..?

Whatsapp Image 2024 05 03 At 8.52.50 Am

Whatsapp Image 2024 05 03 At 8.52.50 Am

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది విడుదల అయిన “సలార్” మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ మూవీని తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.సలార్ మూవీ దాదాపు 700 కోట్లకు కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్నప్రభాస్ కు ఈ సినిమా భారీ ఊరటను ఇచ్చింది.బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సలార్ మూవీకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.థియేటర్లలో అదరగొట్టిన సలార్ మూవీ ఓటీటీలో కూడా దుమ్మురేపింది.

ఇటీవల స్టార్ మాలో ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్ మూవీ ఇక్కడ కూడా రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో స్టార్ మా ఆడియెన్స్ కు గోల్డెన్ ఆఫర్ ప్రకటించింది. సలార్ లో ప్రభాస్ వాడిన బైక్ లాంటి బైక్ ను గెలుచుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం సలార్ బైక్ ఎస్ఎంఎస్ కాంటెస్ట్ ను కూడా నిర్వహించింది.అయితే ఈ కాంటెస్ట్ లో చాలా మంది ప్రేక్షకులు పాల్గొనగా విజయవాడకు చెందిన వరప్రసాద్ ను ఆ బైక్ వరించింది. తాజాగా ఈ పోటీలో గెలిచిన విన్నర్ ను స్టార్ మా ప్రకటిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్స్ లక్కీ విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.అలాగే స్టార్ మా కూడా ఆ లక్కీ విన్నర్ కు అభినందనలు తెలిపింది.అలాగే బైక్ గెలుచుకున్న వరప్రసాద్ మాట్లాడుతూ తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు..

Exit mobile version