Site icon NTV Telugu

Double ismart: ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బడా నిర్మాత..ఎవరంటే..?

Untitled Design (17)

Untitled Design (17)

రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధించడంతో డబుల్ ఇస్మార్ట్ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత పూర్తి నుండి వస్తున్న ఈ  చిత్రం భారీగా బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్ర రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హింది రైట్స్ ను ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మాత కొనుగోలు చేసారు. నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ ప్రాతిపాదికన ఏపీ/తెలంగాణ 56కోట్ల రూపాయలు, హిందీ 6 కోట్ల రూపాయలకు హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అదే రోజు విడుదల కానున్న మిస్టర్ బచ్చన్, తంగలాన్ చిత్రంతో పోటీపడనున్నాడు డబల్ ఇస్మార్ట్

మరోవైపు ఈ చిత్రాన్ని ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు నిర్మాత ఛార్మి. ఓవర్సీస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి నిర్వాణ సినిమాస్, తెలుగు రైట్స్ డిస్ట్రిబ్యూటర్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా కొనుగోలు చేశారు. డబుల్ ఇస్మార్ట్ ను ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచాయి. త్వరలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు మేకర్స్ .

Also Read: Rajnikanth : దసరా రేస్ నుండి రజనీకాంత్ సినిమా ఔట్..!

Exit mobile version