Site icon NTV Telugu

బాలకృష్ణ వ్యాఖ్యలపై ట్రోలింగ్

Balakrishna Gives his guest house to Covid-19 Patients

“ఆదిత్య 369” చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. “హూ ఈజ్ బాలయ్య” అంటూ నెటిజన్లు స్పెషల్ హైస్ ట్యాగ్ తో మండిపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి తమ కుటుంబం చేసిన కృషిని ఇలాంటి అవార్డులు భర్తీ చేయలేవని, భారతరత్న ఎన్టీఆర్ కాలిగోటితో, చెప్పు తో సమానం అని అన్నారు.

Read Also : ఆర్ఆర్ఆర్ : ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో రాబోతోంది!

అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ ఎవరో తనకు తెలియదని, పదేళ్లకు ఒకసారి హిట్ ఇచ్చే ఆయనకు ఆస్కార్ అవార్డు ఇచ్చారని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక శైలి ఉంటుందని, ఇళయరాజా గారి సంగీతం “ఆదిత్య 369” చిత్రానికి అద్భుతమని అన్నారు. ఈ కామెంట్స్ లో భారతరత్న అని చెప్పుతో, కాలిగోటితో సమానం అని అనడం, ఆస్కార్ అవార్డ్ గ్రహీత కూడా తనకు తెలియదని చెప్పడం ట్రోలింగ్ కు దారి తీసింది. దీంతో అసలు బాలయ్య ఎవరంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.కాగా 1993లో బాలకృష్ణ చిత్రం “నిప్పు రవ్వ”కు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Exit mobile version