ఆర్ఆర్ఆర్ : ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో రాబోతోంది!

“ఆర్ఆర్ఆర్”కు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నందున దేశం మొత్తం దీనిపై దృష్టి సారించింది. ఈ చిత్రం టాకీ పార్ట్‌తో పూర్తయింది. ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించడంలో బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ నెట్టింట్లో రికార్డ్ వీక్షణలను క్లాక్ చేసే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా ట్రైలర్ కు వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది అంటూ రాజమౌళి సైతం పొంగిపోయారు. ఇప్పుడు షూట్ చేసిన మొదటి రోజు నుండే ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి మేకర్స్ చాలా కంటెంట్ చిత్రీకరించారని తెలుస్తోంది. ‘బిహైండ్ ది సీన్స్’ మొత్తం ఒక డాక్యుమెంటరీ గా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.

Read Also : గ్రాండ్ మదర్ తో గ్రాండ్ మస్తీ… ‘పార్టీ విత్ పాటీ’ అంటోన్న అదా శర్మ!

ఇక ప్రమోషన్ కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తారాగణం, సిబ్బంది ఇంటర్వ్యూలతో పాటు “ఆర్ఆర్ఆర్” మేకింగ్ ను చూపించే ఈ డాక్యుమెంటరీని ఒక ఓటిటి దిగ్గజం ప్రసారం చేయనున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు బేసిక్ మేకింగ్ వీడియో మాత్రమే విడుదల చేసిన రాజమౌళి చేస్తున్న సన్నాహాలు రాబోయే రోజుల్లో సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లవచ్చు. “ఆర్‌ఆర్‌ఆర్” అక్టోబర్ 13 న గ్రాండ్‌గా విడుదల కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-