ఈ శుక్రవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్దు మూడు ప్యాన్ ఇండియా సినిమాలు పోటీపడ్డాయి. అవే కమన్ నటించిన ‘విక్రమ్’, అక్షయ్ కుమార్ నటించిన ‘పృధ్వీరాజ్’, అడవిశేష్ నటించిన ‘మేజర్’. ‘విక్రమ్’ లో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్, అతిథి పాత్రలో సూర్య మెరిశారు. ‘ఖైదీ’తో ఊపుమీదున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. దీంతో దీనిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు పాజిటీవ్ టాక్ రావటంతో తమిళనాట మంచి హిట్ అనే ముద్రపడింది. ఇతర భాషల్లో కూడా చాలా కాలం తర్వాత కమల్ కి మంచి సినిమా పడింది అనే టాక్ వినిపించింది. ఇక అడివి శేష్ నటించిన ‘మేజర్’ ఓ బయోపిక్. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి ఊహలకు అనుగుణంగా యాక్షన్, ఎమోషనల్ తో ఆకట్టుకుంటోంది.
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా హిందీ వెర్షన్ కూడా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ టైటిల్ పాత్ర పోషించిన ‘పృథ్వీరాజ్’ కూడా ఈ వారమే వచ్చింది. అయితే ఓపెనింగ్ డే ఆశించిన స్థాయిలో వసూళ్ళను సాధించలేక పోయింది. అక్షయ్ గత చిత్రం ‘బచ్చన్ పాండే’ తొలిరోజు వసూళ్ళ కంటే ‘పృథ్వీరాజ్’ తొలిరోజు కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో అయితే కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా సాధించలేక పోయింది. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించటం విశేషం. సో కమల్ తొలి రోజు అద్భుతమైన వసూళ్ళను సాధించగా అక్షయ్ నిరాశాపూరితంగా జర్నీ ఆరంభించాడు. విక్రమ్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, పృథ్వీరాజ్ మాత్రం 17.5 కోట్లతో సరిపెట్టుకున్నాడు. ఇక అడవి శేష్ మేజర్ 13.5 కోట్లను వసూలు చేశాడు. దీనిని బట్టి చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్‌ను సౌత్ సినిమాలే శాసిస్తున్నాయని మరోసారి రుజువు అయింది. మరి బాలీవుడ్ బాబులు దక్షిణాదివారి చూసి అసూయపడకుండా ఉండగలరా!.
