ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్‌కు వెళ్లింది నేషనల్ క్రష్ రష్మిక. రణ్ బీర్ కపూర్ సరసన నటించిన ‘యానిమల్’, అల్లు అర్జున్ తో చేసిన ‘పుష్ప’ 2, వికీ కౌశల్ తో కలిసి నటించిన ‘ఛావా’ ఈ మూడు ఘన విజయాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. దీంతో బాలీవుడ్ హీరోయిన్స్‌ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంటోంది ఈ చిన్నది.ఇక ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లు లైన్ లో పెడుతుంది రష్మిక. ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘సికిందర్’, నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ‘కుబేర’ సినిమాలతో పాటు ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే మూవీ లో కూడా నటిస్తోంది. ఇక ఇప్పుడు రష్మిక క్రేజ్‌ను నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ రష్మిక తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం హింది లో ఓ బడా నిర్మాణ సంస్థ.. రష్మిక మందనతో లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. అది కూడా ఏకంగా ఏకంగా రూ.70 నుంచి రూ.100 కోట్ల మధ్యలో బడ్జెట్‌ను కూడా అనుకుంటున్నారట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక రష్మిక క్రేజ్ ప్రస్తుతం ఎంత పీక్స్‌లో ఉన్నప్పటికీ, లేడీ ఓరియెంటెడ్ సినిమా పై ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.