NTV Telugu Site icon

Soori: విడుదలై – 2 ఫస్ట్ లుక్ విడుదల ఎప్పుడంటే ..?

Untitled Design (9)

Untitled Design (9)

తమిళంలో హాస్యనటులలో సూరి ఒకడు. సంతానం పూర్తి స్థాయి హీరోగా మారడంతో స్టార్ హీరోల సినిమాలలో సూరి, యోగబాబు తప్పని సరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా శివకార్తికేయన్ సినిమాలలో సూరికి ప్రత్యేకమైన పాత్ర ఉండాల్సిందే. కాగా సూరి హీరోగా మారాడు. తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటించాడు. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూరికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

కాగా విడుదలై-1 ఎండింగ్ లో పార్ట్ -2 రాబోతున్నట్టు ప్రకటించాడు దర్శకుడు వెట్రిమారన్. ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యం అవుతూవస్తోంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విడుదలై పార్ట్ -2 ఫస్ట్ లుక్ ని ఈ జూలై 17 న రిలీజ్ చేస్తున్నట్టుగా హీరో సూరి తన ‘x ‘ ఖాతా ద్వారా తెలియజేశాడు. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదలై ఫస్ట్ లుక్ రానుంది.

విడుదలై- 1, 2 భాగాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డ్యామ్(IFFR) స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించగా విశేష స్పందన లభించింది. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రెడ్ జెయింట్ మూవీస్, గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా సూరి హీరోగా రెండవ చిత్రం ‘గరుడన్’ లో నటించాడు. ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. కొద్దీ రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ రిలీజ్ అయిన ‘గరుడన్’ అత్యధిక వ్యూస్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు మొదలు పేటనున్నాడు సూరి.

Also Read : Bollywood Actress : బాలీవుడ్ భామకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు..ఇంతకీ ఎవరు..?

Show comments