Site icon NTV Telugu

Bhagyashri Borse : భాగ్యానికి హిట్ భాగ్యం ఎప్పుడో..?

Bhagyasri

Bhagyasri

మిస్టర్ బచ్చన్‌తో ఓవర్ నైట్ కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిన భాగ్యశ్రీ బోర్సేకి క్రేజేతే ఉంది కానీ లక్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోతోంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ప్లాపులు పలకరిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్‌లో సరైన ఐడెంటిటీ రాకపోవడంతో టాలీవుడ్‌లో పాతుకుపోవాలని చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.. గ్లామర్ షోతో డామినేట్ చేస్తొంది కానీ హిట్ సౌండ్ వినలేకపోతోంది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయితే.. ఈ ఏడాది వచ్చిన కింగ్డమ్ ఆమెను నిరాశపర్చింది.

Also Read : Akkineni Nagarjuna : మొన్న రజనీకాంత్.. నిన్న ధనుష్.. నేడు ప్రదీప్ రంగనాథ్..

విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్‌లో కనిపించిన భాగ్యశ్రీ బోర్సే కేవలం పాటలకే పరిమితమైపోవడంతో పెద్దగా రిజిస్టరైంది లేదు. ఈ తలనొప్పే అనుకుంటే.. మరో ప్లాప్ ఆమె ఖాతాలో పడి కెరీర్ని డైలామాలో పడేసింది. ఇక దుల్కర్ సల్మాన్ సరసన నటించిన కాంత సెప్టెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉండగా  పోస్ట్ పోన్ అయ్యింది. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఇక ఆమెకు ఉన్న ఒకే ఒక హోప్ రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూక.  రెడ్ తర్వాత హిట్టే చూడని రామ్ పోతినేనితో జోడీ కడుతోంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాతోనే ఈ ఇద్దరి మధ్య మంచి ర్యాపో స్టార్టైందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా హిట్ కొట్టడం అటు రామ్ పోతినేని, ఇటు భాగ్యశ్రీకి ఇంపార్టెంట్. ఆ మధ్య రిలీజ్ చేసిన సాంగ్స్, రీసెంట్లీ వదిలిన టీజర్ మూవీపై ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాయి. మరి ఆడియన్స్‌ను ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.

Exit mobile version