NTV Telugu Site icon

OTT : సినిమా రిలీజ్ లపై ఓటీటీ సంస్థల ఒత్తిడి..కారణం ఏంటంటే..?

Untitled Design (2)

Untitled Design (2)

తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ సినిమాగా మారిపోయింది. బాహుబలి నుండి తెలుగు సినిమాలను నిర్మించే విధానం, సినిమా స్టాండర్డ్స్ మొత్తం మారిపోయాయి. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ వంటి సంస్థలు రావడంతో నిర్మాతలకు వాటి రూపంలో ఆదాయం రావడం మొదలైంది. కోవిడ్ కారణంగా, చిన్న,పెద్ద అని తేడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీసి ఓటీటీలకు సేల్ చేసి సొమ్ము చేసుకున్నారు. కానీ పోస్ట్ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి.

నేడు ఓటీటీ సంస్థలు ఆచి తూచి సినిమాలను కొనడం స్టార్ట్ చేసాయి. మరోవైపు థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సూపర్ హిట్ టాక్ వచ్చి, మౌత్ టాకింగ్ బాగుంటే తప్ప, యావరేజ్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు. అందుకు అధిక టికెట్ రేట్ ఉండడం కూడా ఒక కారణం. రాను రాను ఓటీటీ సంస్థలు సినిమాలు కొనే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ మధ్యకాలంలో ఓటీటీ సంస్థలు చిన్న సినిమాలను ఒక్కటి కూడా కొనలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు ఓటీటీ సంస్థలు మరో అడుగు ముందుకేసి సినిమా రిలీజ్ ను శాసించే స్థాయికి వచ్చాయి. ఇటీవల సినిమాల రిలీజ్ లపై ఓటీటీ సంస్థల ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళ డీలింగ్ లో ఉన్న కండిషన్స్ కోసమే చాలా మంది నిర్మాతలు ఇష్టం లేకపోయినా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి వస్తుందట. పైగా నాలుగు, ఐదు వారాలకే స్ట్రీమింగ్ కు ఇచ్చేలా కండిషన్ పెడుతున్నాయి సదురు సంస్థలు. ఇక చిన్న సినిమాలన సంగతి సరే సరి. కేవలం పే పర్ వ్యూ రూపంలో మాత్రమే చిన్న సినిమాలను అది కూడా థియేటర్లలో రిలీజ్ అయిన వాటిని తిసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగె కొనసాగితే సినిమాల మనుగడకే ముప్పు వాటిల్లడం గ్యారెంటీ.

 

Also Read : Nani : భారీ స్థాయిలో దసరా -2 ..బడ్జెట్ ఎంతంటే..?

Show comments