పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Also Read : Hot Beauty : సినిమాలు ప్లాప్.. ఐటం సాంగ్ తీసేసారు.. హాట్ బ్యూటీకి ఎన్ని కష్టాలో
ఈ నేపథ్యంలో డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశాడు డైరెక్టర్ సుజిత్. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెందిన పోర్షన్ డబ్బింగ్ పనులు పూర్తి చేసారు. ఇంజనీర్ పప్పు స్టూడియో లో OG తన పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. రిలీజ్ కు ఇంక కేవలం పది రోజులు మాత్రేమే ఉన్నాయి. డబ్బింగ్ పనులు ఫినిష్ చేసి సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని ఓవర్సీస్ కాపీ రెడీ చేయాలని జెట్ స్పీడ్ లో వర్క్ చేస్తోంది యూనిట్. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. OG ట్రైలర్ ను రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు. ఇందుకోసం విజయవాడ లేదా వైజాగ్ లో ఓపెన్ గ్రౌండ్ లో గ్రాండ్ గా చేయాలనీ చూస్తున్నారు. అలాగే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న హైప్ చూస్తుంటే మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
