Site icon NTV Telugu

Ambajipeta Marriage Band: “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాపై నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రశంసలు..

సుహాస్ హీరోగా నటించిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాపై ప్రశంసలు కురిపించారు పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు. పాలకొల్లులో ఈ సినిమా స్పెషల్ షో చూసిన వారు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆ సంఘ ప్రధాన కార్యదర్శి సూరన్న మాట్లాడుతూ – “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను మా నాయకులు, సభ్యులతో కలిసి చూశాము. మా అందరికీ బాగా నచ్చింది. ఈ సినిమాలో మా నాయి బ్రాహ్మణులు కింద స్థాయి నుంచి సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారు. సినిమాను సహజంగా తెరకెక్కించారు. గతంలో చిరంజీవి గారి స్వయంకృషి సినిమా చూసిన తర్వాత ఒక కులం వారం ఎలా గర్వపడ్డారో..ఈ సినిమా చూశాక మేమంతా సంతోషిస్తున్నాం.

Also Read; Tollywood Movies: ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

ఇది ఒక కులానికి సంబంధించిన సినిమా కాదు ప్రేక్షకులంతా చూడాలి. నిర్మాత బన్నీ వాస్ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”తో ఒక మంచి సినిమా నిర్మించారు. ఈ సినిమాకు తప్పకుండా జాతీయ అవార్డ్ రావాలి. నాయి బ్రాహ్మణ సేవా సంఘంగా మేమంతా ఈ సినిమాకు ప్రచారం చేస్తాం. అన్నారు.”అంబాజీపేట మ్యారేజి బ్యాండు” చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ నెల 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా రెండు రోజుల్లో 7 కోట్ల కు పైగా రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి ఘన విజయం దిశగా వెళ్తోంది.

Exit mobile version