టాలీవుడ్ లో గత ఐదు రోజులుగా షూటింగ్స్ లేక మూగబోయింది. వేతనాల పెంపుపు పై కార్మిక సంఘాలకు, ఫిల్మ్ ఛాంబర్ కు మధ్య మొదలైన వివాదం బంద్ కు దారి తీసింది. ఈ విషయమై ఈ రోజు పలువురు చిన్న సినిమా నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ
సీ. కళ్యాణ్ : చిన్న సినిమాల నిర్మాతలతో సమావేశం నిర్వహించాము. చిన్న నిర్మాతలు మార్కెటింగ్ లేక థియేటర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న సినిమాల వల్లే కార్మికుల మనుగడ ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న జీతం కంటే 25% జీతాలు తక్కువ తీసుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేశారు.మేము ఒక్క పైసా పెంచమని నిర్మాతలు చెప్పారు.ఎవరితో అయినా సినిమాలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం నిర్మాణం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.రూ. 4 నుండి 5 కోట్లు చిన్న సినిమాకు ఖర్చు అవుతుంది. చిన్న సినిమా నిర్మాతలు ఇప్పటి నుంచి ఎవరితో అయినా సినిమాలు చేసుకోవచ్చు. ప్రొడ్యూసర్స్ మీద దాడి చేస్తే తాట తీస్తాం.పెద్ద హీరోలకు నిర్మాతలు తమ బాధలు చెప్పుకున్నారు. కార్మికులు గొంతెమ్మ కోరికలు విడనాడాలి. రెండు రోజుల్లో సమ్మె ముగుస్తుందని భావిస్తున్నా…నిన్ననే దిల్ రోజుతో మాట్లాడను మళ్ళీ ఎప్పుడు కబురు పంపినా మాట్లాడడానికి మేము సిద్ధం.
నిర్మాత చదలవాడ శ్రీనివాస్ : చాంబర్, కౌన్సిల్ మాత్రమే ఈ సమస్య పై మాట్లాడే అధికారం ఉంది.తొందరలోనే సమ్మె ముగుస్తుందని ఆశిస్తున్నాం.
ప్రసన్న కుమార్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ : ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లో జీతాలు ఎక్కువగా ఇస్తున్నాం. చిన్న సినిమా బ్రతికితేనే సినిమా బ్రతుకుటుంది.98 శాతం ఫెల్యూర్ ఉంది. నిర్మాత చనిపోతూ కార్మికులను బ్రతికిస్తున్నాడు. అసలు ఇస్తున్న రెమ్యునరేషన్ ను 25%తగ్గించి ఇవ్వాలని అనుకున్నాం. కానీ స్టార్ హిరోలతో తీయని సినిమా ఏదైనా చిన్న సినిమానే. నిర్మాతలు కోమాలో ఉన్నారు. ఆక్సిజన్ తీసేసి మమ్మల్ని చంపేయవద్దు. ఈ సమస్య ఛాంబర్ లోనే పరిష్కరించుకుంటాం. ఇతరుల ప్రమేయం అవసరం లేదు. అందరం ఒకే కుటుంబ సభ్యులము.
