NTV Telugu Site icon

Jr.NTR : దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ప్రకటించిన నిర్మాత నాగవంశీ

Devara Sucsess Meet

Devara Sucsess Meet

దేవర బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ సక్సెస్ మీట్ జరపాలని ప్లాన్ చేసారు మేకర్స్. అసలే .ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవరకు కనీసం ప్రెస్ మీట్ నిర్వహించలేదు. సక్సెస్ మీట్ తప్పకుండా చేయలని చూసారు.

Also Read : Tollywood : ఒక్కటిగా ముక్తకంఠంతో కొండా సురేఖపై గొంతెత్తిన టాలీవుడ్..

కానీ దేవర సక్సెస్ మీట్ నిర్వహించడం లేదని దేవర రైట్స్ కొనుగోలు చేసిన నాగవంశీ తెలిపారు. తన వ్యక్తిగత X ఖాతాలో ” దేవర సునామిని సృష్టించి, బాక్స్ ఆఫీస్ వద్ద అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో భాగస్వామ్యమైన మీలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోయినందున, తారక్ అన్న తెలుగు రాష్ట్రాల్లోని తన అభిమానులతో దేవర విజయాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఒక ఈవెంట్‌ను నిర్వహించాలని పట్టుదలతో ఉన్నాడు. మేము ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ, దసరా మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, భారీ ఎత్తున నిర్వాహ్ణచాలనుకున్న దేవర విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాము. పరిస్థితి మా నియంత్రణలో లేదు మరియు ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయినందుకు అభిమానులందరికీ మరియు మా ప్రేక్షకులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. దేవర బ్లాక్ బస్టర్ తో తారక్ అన్నను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిగా, మీరు  మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము” అని ట్వీట్ చేసారు

 

Show comments