NTV Telugu Site icon

VETTAIYAN : రజనీకాంత్ ‘వెట్టయాన్’ ప్రివ్యూ టీజర్ రిలీజ్..

Untitled Design (29)

Untitled Design (29)

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వేట్టైయాన్ – ది హంట‌ర్’. జై భీమ్ దర్శకుడు టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు 2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్ష్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’.

Also Read : LuckyBaskhar : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న ‘లక్కీ భాస్కర్’..

ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో,   ప్రివ్యూ వేడుకను చెన్నై లో  గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఫస్ట్ ప్రివ్యూ అంటూ వచ్చిన టీజర్ ను పరిశీలిస్తే  క్రిమినల్స్ ను రూత్ లెస్ గా ఎన్ కౌంటర్ చేసే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కాగా వీరిపై విచారణకు ఆదేశించిన పై అధికారిగా అమితాబ్ బచ్చన్ కనిపించాడు. టీజర్ మొత్తం రజనీ – అమితాబ్ పైనే నడిపాడు దర్శకుడు, అనిరుధ్ బ్యాగ్రౌండ్ ఎప్పటిలాగే అదరగొట్టాడు.  ఆడియెన్స్‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది.తెలుగు రిలీజ్ హ‌క్కుల‌ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. వేట్టైయాన్ – ది హంట‌ర్‌’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Show comments