Site icon NTV Telugu

War 2 : ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ – కియారా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Kiara Advani

Kiara Advani

బాలీవుడ్‌ టూ కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’ . యష్ రాజ్ స్పై యూనివర్స్‌ల్లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌లో, ఒకవైపు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మరోవైపు తెలుగు స్టార్ ఎన్టీఆర్ కనిపించనున్నారంటే అంచనాలు ఎలా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, గ్లామరస్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా, హృతిక్ రోషన్ ఒక స్పెషల్ పోస్టుతో తన ఎగ్జైట్మెంట్‌ను షేర్ చేసింది.

Also Read : Harihara Veeramallu : హరిహర వీరమల్లు ఫైనల్ రన్‌టైం ఇదేనా?

‘ఈ సినిమా విషయంలో మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. మీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం ఎన్టీఆర్ తో కలిసి అయాన్ ముఖర్జీ సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూస్తున్నాను. మన టీమ్ మొత్తం ఈ సినిమాకు ప్రాణం పోసింది’ అని రాసుకొచ్చింది కియారా. ఈ పోస్టుతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హృతిక్ అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో కియారా వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్‌ను పెంచాయి.

 

Exit mobile version