NTV Telugu Site icon

Waltair Veerayya: పది రోజులైనా తగ్గేదేలే.. డబుల్ సెంచరీ కొట్టిన ‘వాల్తేరు వీరయ్య’

Walter1

Walter1

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ఊచకోత ఇప్పుడిప్పుడే తగ్గేలా కనబడట్లేదు. సినిమా రిలీజై పదిరోజులైనా కూడా భారీ స్థాయిలో కలెక్షలు రాబడుతూ దూసుకెళ్తోంది. అమలాపురం టూ అమెరికా ఎక్కడ చూసినా ఈ మూవీ కలెక్షన్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ మూవీ 200 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. అలాగే యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద 2.25 మిలియన్ డాలర్లను దాటి 3 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతోంది.

ఈ సినిమాలో వింటేజ్‌ మెగాస్టార్‌ను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికెల్లావయ్యా బాబీ అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి తగ్గట్టే కలెక్షన్లూ వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తొలి రోజే అనుకంటే రెండో రోజు కూడా భారీ కలెక్షన్‌లు రాబడుతూ అందరిని ఆశ్చర్యంలో పడేసింది. రీ ఎంట్రీ తర్వాత ఈ రేంజ్‌ కలెక్షన్‌లు ఏ సినిమా రాబట్టలేకపోయింది. ఇక చిరుకు రవన్న తోడవడంతో నిర్మాతలపై కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాలతకు లాభాలు తెచ్చిపెట్టే పనిలో ఉంది.

Womens IPL: విమెన్స్ ఐపీఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీకి 600 కోట్లు!

అలాగే, చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశారు. ఈ మూవీ పదో రోజు రూ.6.6 కోట్లు కలెక్ట్‌ చేసి నాన్‌-రాజమౌళి రికార్డు సాధించింది. నిజానికి ఈ సినిమాకు మొదట డివైడ్‌ టాక్ వచ్చింది. కానీ టాక్‌తో సంబంధలేకుండా కలెక్షన్‌ల వేట కొనసాగిస్తుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు. చిరుకు జోడీగా శృతిహాసన్‌ నటించింది. ఇక రవితేజ పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా మంచి మార్కులే కొట్టేశాడు. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.

Show comments