VYRL South: VYRL సౌత్ అనేది యూనివర్శల్ మ్యూజిక్ ఇండియా నుండి వచ్చిన ఓ అద్భుతమైన వేదిక. ఇది దక్షిణ భారతదేశంలో ఐపాప్ మ్యూజిక్ ను దాని కల్చర్ ని పరిచయం చేసేందుకు అంకింతం చేయబడింది.అదిరిపోయే మ్యూజిక్ తో, క్లట్టర్ బ్రేకింగ్ స్లిక్ వీడియోస్ కలిగి వున్న ఐపాప్ మ్యూజిక్ కోసం ఎదురు చూసే మ్యూజిక్ లవర్స్ అందరికి Vyrl సౌత్ ఓ వేదికలా మారింది. ఈ లేబుల్ తన మొదటి రెండు సింగిల్స్ ను రిలీజ్ చేయగా మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Read Also :Aa Okkati Adakku : ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మొదటి సాంగ్ అయిన “ఓసెలియా,” కి గణేష్ క్రొవ్విడి, రిక్కీ బి మరియు ఫిరోజ్ ఇజ్రాయెల్ మ్యూజిక్ అందించారు.ఈ పాటలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ కనిపించారు. ఈ మెలోడీ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.మొదటి సాంగ్ ఎంతగానో ఆకట్టుకోవడంతో Vyrl సౌత్ తన రెండవ సింగిల్ ను కూడా రిలీజ్ చేసింది “సిన్నదాని సూపులే” అనే సాంగ్ లో బిగ్ బాస్ భామ శ్రీ సత్య , వినోద్ కుమార్ కనిపించారు. ఈ సాంగ్అదిరిపోయే విజువల్స్ తో మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ కు యాడిక్రీజ్ మ్యూజిక్ అందించారు.vyrl సౌత్ నుంచి వచ్చిన ఈ రెండు సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.