VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వృషకర్మ. SVCC బ్యానర్ పై బివియస్ ప్రసాద్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నాడు సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ. ఆ మధ్య వచ్చిన వృషకర్మ గ్లిమ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఏరియాల వారీగా ఈ సినిమా రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో విడివిడిగా ప్రాంతాల వారీగా బిజినెస్ క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు నాగవంశీ. అందులో భాగంగానే అత్యంత కీలకమైన నైజాం ఏరియా రైట్స్ డీల్ క్లోజ్ చేశారు.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘వృషాకర్మ’ నైజాం థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 15 కోట్ల రూపాయల భారీ ధరకు అమ్ముడయ్యాయి. విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో నైజాంలో అడుగుపెడుతున్న రాజుకుంట ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవడం విశేషం. ఈ రూ. 15 కోట్ల డీల్‌లో రూ. 12 కోట్ల రూపాయలు ఎన్ ఆర్ ఎ (NRA – Non-Returnable Advance) కాగా మిగిలిన 3 కోట్ల రూపాయలు రికవరబుల్ అడ్వాన్స్‌గా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. నైజాంలో నాగచైతన్య సినిమా ఈ ధర పలకడం రికార్డ్ అనే చెప్పాలి. ఈ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం సినిమాపై ఉన్న అంచనాలకు క్రేజ్‌కు అద్దం పడుతోంది. నాగవంశీ పక్కా ప్లానింగ్‌తో థియేట్రికల్ రైట్స్‌ను వేర్వేరు ఏరియాలకు రీజనల్ వైజ్‌గా విక్రయిస్తున్నారు. నైజాం వ్యాపారం ఈ స్థాయిలో ముగియడంతో త్వరలోనే మిగిలిన ఆంధ్ర, సీడెడ్ ఏరియాల డీల్స్ కూడా రికార్డు రేట్లకు క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read
- Raaka: 'రాకా'లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
తాజావార్తలు
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!