సంక్రాంతి 2026కి విడుదలైన సినిమాల్లో ‘నారీ నారీ నడుమ మురారి’ మంచి హైప్‌తో దూసుకెళ్తోంది. ‘చార్మింగ్ స్టార్’ శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. తాజాగా నటుడు నరేష్ విజయ్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నరేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ‘శుభకృత్ నామ సంవత్సరం’. ఎస్‌ఎస్ సజ్జన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో నారీ నారీ నడుమ మురారి మూవీ గురించి నరేష్ మాట్లాడారు.
‘ప్రతి సంవత్సరం మన తెలుగు సినిమా కళకళలాడాలి. ఈ ఏడాది నేను నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్ అయింది. గోవాలో షూటింగ్ పూర్తిచేసుకుని నిన్న వచ్చాం. పవిత్ర, నేను సినిమాకి వెళ్లాం. మల్టీప్లెక్స్ వద్దు, సింగిల్ థియేటర్ వద్దు అని చెప్పా. సింగిల్ థియేటర్‌లో టికెట్స్ లేవు. నా సినిమాకి నాకే టికెట్లు దొరకడం లేదు. ఇది నా జీవితంలో మొదటిసారి. నేను షాక్ అయ్యాను. ఎక్కడ సినిమా ఆడుతుంది అంటే.. ఆర్కే కంప్లెక్స్ అని చెప్పారు. సరే టికెట్స్ బుక్ చేయమని చెప్పా. మల్టీప్లెక్స్ కదా జనాల సందడి ఉండదనుకున్నా. కానీ ఈలలు, కేకలతో రెచ్చిపోయారు. ఇలా ఎప్పుడూ చూడలేదు నేను. చాలా సంతోషంగా అనిపించింది’ అని నరేష్ సరదాగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలు వినగానే అక్కడున్నవారు నవ్వులు ఆపుకోలేకపోయారు.
Also Read: OTR: మంత్రుల మెడ మీద పొలిటికల్ కత్తి వేలాడుతోందా?.. ఫలితాల ఆధారంగా గ్రేడింగ్?
నరేష్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్స్ కూడా ‘ఇది నిజమైన బ్లాక్‌బస్టర్ క్రేజ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పండుగ సీజన్‌లో రిలీజైన నారీ నారీ నడుమ మురారి సినిమాకు థియేటర్ల సంఖ్య పెరిగినా.. డిమాండ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఈ సినిమాలో నరేష్ కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. మొత్తానికి నారీ నారీ నడుమ మురారి సినిమాపై ఉన్న క్రేజ్‌ను నరేష్ మరింత పెంచారు. తన సినిమాకే టికెట్లు దొరకలేదన్న ఆయన మాటలు ఈ సంక్రాంతికి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పకనే చెబుతున్నాయి.
