NTV Telugu Site icon

Viswak Sen : అవకాశం వస్తే ఆ సినిమాలో నటించాలని వుంది..

Gangs Of Godavari

Gangs Of Godavari

Viswak Sen : మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ఛల్ మోహన్ రంగ మూవీ ఫేం కృష్ణ చైతన్య ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విశ్వక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కింది.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను మేకర్స్ మే 31న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ ,ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Read Also :Ramajogayya Sastry : దేనికైనా కాస్త ఓపిక, సహనం ఉండాలి.. వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ట్వీట్..

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.ఈ సినిమా మంచి విజయం సాధించాలని బాలయ్య విశ్వక్ ను ఆశీర్వదించారు.ఇదిలా ఉంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.నేను ఎంతో కూల్ పర్సన్ అని విశ్వక్ తెలిపారు.కాకపోతే అప్పుడప్పుడు కోపం వస్తుంది అని తెలిపారు.అయితే బయట మాత్రం నా గురించి వేరేలా  ప్రచారం జరుగుతుందని తెలిపారు.ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కు బిగ్ ఫ్యాన్ అయిన విశ్వక్ సేన్ ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న “ఎన్టీఆర్ 31 “మూవీలో ఛాన్స్ వస్తే కచ్చితంగా నటిస్తాను అని తెలిపారు.