Vishwambara Release Date: ఉస్తాద్, పెద్ది క్లోజ్.. ఇక అందరి కళ్లు మెగాస్టార్ ‘విశ్వంభర’పైనే!

  • టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా భారీ సినిమాల రిలీజ్ డేట్స్
  • మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్
  • ఏప్రిల్ 30న పెద్ది విడుదల
  • అందరి కళ్లు 'విశ్వంభర' పైనే
Vishwambhara Release Date

Vishwambhara Release Date

టాలీవుడ్‌లో భారీ సినిమాల రిలీజ్ డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి పీక్స్‌లో ఉంది. ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్, ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ సినిమాల రిలీజ్ డేట్స్‌ వచ్చేశాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’పైకి వెళ్లింది.

పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా, అలాగే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రాల విడుదల తేదీలు బుధవారం (ఫిబ్రవరి 4) వచ్చాయి. ఉస్తాద్ మార్చి 26న రిలీజ్ అవుతుండగా.. పెద్ది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబాయ్, అబ్బాయిలు తమ సినిమాలు పరస్పరం క్లాష్ కాకుండా మంచి గ్యాప్‌ను చూసుకున్నారు. మెగా సినిమాలు ఒకదానికొకటి అడ్డంకి కాకుండా ప్లాన్ చేయడం అభిమానులకు కూడా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారవడంతో.. టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్‌లో ఓ క్లారిటీ వచ్చినట్లయింది.

Also Read: OPPO K13 Price Hike: షాకింగ్.. తగ్గాల్సింది పోయి భారీగా పెరిగిన ‘ఒప్పో కే13’ ధర!

ఇప్పుడు చిరంజీవి ‘విశ్వంభర’ ఎప్పుడు విడుదల కానుంది? అనే ప్రశ్న అభిమానుల మనసులను తొలిచేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. వీఎఫ్‌ఎక్స్‌ పనుల వల్ల ఆలస్యమైంది. సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్.. చిరంజీవి కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విశ్వంభర టీమ్ త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతోందట. జులై రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. జులై 9న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైందట. బిజినెస్ డీల్స్‌ను క్లోజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పవన్, చరణ్ సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ కావడంతో.. ఇప్పుడు మెగా అభిమానులందరి చూపూ విశ్వంభర పైనే ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.