Site icon NTV Telugu

Vishwambhara : త్రిశూలంతో రుద్రనేత్రుడిలా చిరంజీవి.. పోస్టర్ అదిరింది!

Chiranjeevi Poster

Chiranjeevi Poster

Vishwambhara Poster Released: బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఫాంటసీ ఫిలిమ్ గా ఈ సినిమాని వశిష్ట డైరెక్టర్ చేస్తూ ఉండగా యూవి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. సినిమా షూటింగ్ జనవరి నెలలో మొదలైంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి పదో తేదీన రిలీజ్ చేస్తున్నట్లు సినిమా అనౌన్స్ చేసినప్పుడే ప్రకటించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు.

Tamilaga Vettri Kazhagam : తన పార్టీ జెండా రిలీజ్ చేసిన విజయ్.. ఎలా ఉందో చూశారా?

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన పోస్టర్ ఒకదాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుకుండా నిలబడి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒక గద పట్టుకుని కనిపించే పోస్టర్ వదులుతారని లీకులు వచ్చినా ఒక కొండ మీద త్రిశూలంతో ఒక మోకాలి మీద మోకరిల్లినట్టు చిరంజీవి కనిపిస్తున్నారు. ఒక రకంగా ఈ పోస్టర్ తో మెగా అభిమానులందరికీ ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు వశిష్ట.ఎంఎం కీరవాణి సంగీతం అందించబోతున్న ఈ సినిమాకి చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సుమారు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని సోషియో ఫాంటసీ ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి లైన్ లోనే ఈ సినిమా కూడా ఉండబోతుందనే ప్రచారం ఉంది.

Exit mobile version