NTV Telugu Site icon

Lailla: విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ సెన్సార్ రివ్యూ..

February 7 (70)

February 7 (70)

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ లో ఏ మాత్రం తగ్గేదేలే అంటుంది. అలా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Also Read: Hug day: కౌగిలింతలోని రహస్యలు..

తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది.ఇందులో బోల్డ్ డైలాగ్స్, కొన్ని సీన్స్ కారణంగా ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్. క్రిస్పీ రన్‌టైమ్‌తో రానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే తన లుక్ మీద చాలా అంచానాలు పెరిగిపొయ్యాయి. ఒక యంగ్ హీరో ఇలాంటి గెటప్ తో రావడం అంటే చిన్న విషయం కాదు. మరి లైలా తన కెరీర్‌కి ఎంత వరకు ప్లెస్ అవుతుందో చూడాలి.