NTV Telugu Site icon

NTR : ఎన్టీఆర్ ప్లాప్ సినిమాని రీమేక్ చేస్తానంటున్న విశ్వక్ సేన్..

Viswak Sen

Viswak Sen

NTR : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ దూసుకుపోతున్నాడు. కమర్షియల్ సినిమాలతో పాటు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు.విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Read Also :Anne Hathaway : ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన ఆ హాలీవుడ్ నటి..

ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు .ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ యాంకర్ సుమ చేసిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.విశ్వక్ సేన్ స్టార్ హీరో ఎన్టీఆర్ కు బిగ్గెస్ట్ ఫ్యాన్ అందరికి తెలుసు.ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే విశ్వక్ చేసే హంగామా అంతా ఇంతా కాదు..అయితే తాజాగా ఇంటర్వ్యూలో యాంకర్ సుమ విశ్వక్ ని ఒకవేళ మీరు ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేస్తే ఏ సినిమా చేస్తారు అని అడుగగా విశ్వక్ వెంటనే ‘నా అల్లుడు’ అని సమాధానం ఇస్తాడు. దీంతో సుమ షాక్ అయింది. అయితే విశ్వక్ మాట్లాడుతూ ఆ సినిమా నాకెంతో ఇష్టం కొన్ని మార్పులు చేసి రీమేక్ చేయొచ్చు అని చెబుతాడు.దీనికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ భిన్నంగా కామెంట్ చేస్తున్నారు.ఎందుకు బ్రో ఆ సినిమాను మళ్ళీ గుర్తు చేస్తావు అని కామెంట్స్ చేస్తున్నారు .

Show comments