Site icon NTV Telugu

Vishwak Sen: పాపం విశ్వక్ సేన్.. దెబ్బకి అడ్రెస్ మార్చేశాడట?

Vishwaksen

Vishwaksen

Vishwak Sen Shifted to Gachibowli from Film Nagar: టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కి వింత పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో యూత్లో మంచి క్రేజ్ అందుకున్న విశ్వక్సేన్ ఆ తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాని హీరోగా నటిస్తూనే డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్నింటితో హిట్ అందుకున్నాడు కొన్నిటితో ఇబ్బంది పడ్డాడు. అయినా సరే ఏ మాత్రం విను తిరగకుండా టాలీవుడ్ లో దూసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అనూహ్యంగా విశ్వక్సేన్ కి ఊహించని ఇబ్బందులు ఎదురైనట్లుగా తెలుస్తోంది. ఆ దెబ్బతో ఆయన ఏకంగా అడ్రస్ కూడా మార్చేసినట్లు చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే గత 45 రోజుల నుంచి విశ్వక్సేన్ ఎక్కువగా మీడియాకి కనిపిస్తూ వస్తున్నాడు.. ఆయన సొంత సినిమా ఈవెంట్లతో పాటు పలువురు చిన్న హీరోల సినిమాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లకు అలాగే ఇతర ఈవెంట్లకు కూడా హాజరవుతున్నాడు. దీంతో ఆడియన్స్ లో విశ్వక్సేన్ ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాడా? ప్రతి హీరో ఈవెంట్ కి ఈయనే కనిపిస్తున్నాడు ఏంటి అనే చర్చ మొదలైంది.

Rakshit Shetty FIR: హీరో రక్షిత్ శెట్టిపై ఎఫ్ఐఆర్ నమోదు!

మొన్నటికి మొన్న ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పూర్తి చేసుకుని వెళుతుండగా అదే వేదిక మీద లాంచ్ చేసుకోవాల్సిన మరో సినిమా యూనిట్ ఆయనకు ఎదురుపడింది. ఆ సమయంలో తమ సినిమా ట్రైలర్ కూడా లాంచ్ చేయాల్సిందిగా కోరితే నేను వేరే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చాను ఇక్కడ అలా చేస్తే బాగుండదు అని వెనక్కి పంపించబోయాడట. మలీయే ఎందుకు వచ్చింది ఇదంతా ఎవరో రికార్డ్ చేసి ఉంటారు విశ్వక్ ను ట్రైలర్ లాంచ్ చేయమంటే చేయను అని వెనక్కి పంపాడు అనేలా వీడియోలు వైరల్ చేస్తారు. అని ట్రైలర్ చూసి లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి వెనక్కి వచ్చాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఆబ్లిగేషన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అని భావించి ఫిలింనగర్ నివాసంలో కాకుండా తాను కొనుగోలు చేసిన గచ్చిబౌలి ఫ్లాట్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడైతే అందరికీ అందుబాటులో ఉంటే అన్ని సినిమా ఈవెంట్లకు ఆహ్వానాలు అందుతున్నాయని అన్నిటికీ వెళ్లాలంటే ఇబ్బందే అని భావించి ఆయన షిఫ్ట్ అయినట్లు చెబుతున్నారు.

Exit mobile version