NTV Telugu Site icon

Vishwak Sen: మిడిల్ ఫింగర్ వివాదంలో విశ్వక్.. నేను ప్రతిసారి తగ్గను?

Vishwak

Vishwak

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా రిలీజ్ కి ముందు జరిగిన ఈవెంట్ కారణంగా సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అభిమానులకు కోపం తెప్పించాయి. ఈ విషయం మీద విశ్వక్సేన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎవరి మీద కోపమో తనమీద తన సినిమా మీద చూపించవద్దని కోరాడు. అయితే నిన్న ఇంస్టాగ్రామ్ వేదికగా ఆయన షేర్ చేసిన మిడిల్ ఫింగర్ పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అందులో మిడిల్ ఫింగర్ చూపిస్తున్న ఫోటో ఉండడంతో కావాలని తమను రెచ్చగొడుతూ ఈ ఫోటో పెట్టి ఉంటాడని వైసిపి అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విశ్వక్సేన్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయం మీద నిన్ననే క్లారిటీ ఇచ్చాడు.

Thala Movie: గ్రాండ్ గా నిర్వహించిన ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..

మా సినిమాకి సంబంధించిన ప్రతి పోస్టర్ నా సినిమాకి సంబంధించింది మాత్రమే. ఒక నెల క్రితం రిలీజ్ అయిన సోను మోడల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడండి అలాగే తాజాగా షేర్ చేసిన రెడ్ సూట్ ఫోటో కూడా గతంలో తీసింది. దయచేసి ప్రేమను పంచండి శాంతిని మెయింటైన్ చేయండి. నా సినిమా ప్రమోట్ చేసుకునే విషయంలో పోస్ట్ చేసే పోస్టర్ల గురించి ఒకటికి రెండుసార్లు నేను ఆలోచించలేను. ఫిబ్రవరి 14వ తేదీన సోను మోడల్ థియేటర్లలోకి వస్తున్నాడు. అతన్ని కలవండి. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడినంత మాత్రాన మీరు ఏదో ఫేమస్ అయిపోరు. నేను ప్రతిసారి తగ్గను, నిన్న మనస్పూర్తిగా బాధపడిన వాళ్లకి నేను సారీ చెప్పాను. దయచేసి ఎక్కువ ఆలోచించకుండా శాంతితో ఉండండి. మళ్లీ చెప్తున్నా, నేను నటుడిని మాత్రమే నన్ను నా సినిమాని రాజకీయాల్లోకి లాగే కంటే అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు