Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Vishwaksen Legacy

Vishwaksen Legacy

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూటే సెపరేటు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఈ టాలెంటెడ్ యాక్టర్, ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లెగసీ’ (Legacy) ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4, 2026న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ విశ్వక్ సేన్, హీరోయిన్ ఏక్తా రాథోడ్ లతో కూడిన ఒక స్ట్రైకింగ్ పోస్టర్‌ను విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ కేవలం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మాత్రమే కాదు, ఇందులో విశ్వక్ సేన్ ఢీకొట్టబోయే పవర్ ఫుల్ విలన్. తన తండ్రి వదిలివెళ్లిన వారసత్వం (లెగసీ) కారణంగా.. ఎటువైపు నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలియని ఒక ప్రమాదకరమైన రాజకీయ ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువకుడిగా విశ్వక్ సేన్ కనిపించబోతున్నాడు. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం.. ఈ నాలుగు స్తంభాల చుట్టూ తిరిగే ఈ కథలో, బాలీవుడ్ విలక్షణ నటుడు ‘కే కే మీనన్’ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. మాస్ కా దాస్ యాటిట్యూడ్ కు, కే కే మీనన్ ఇంటెన్స్ విలనిజానికి మధ్య జరిగే మైండ్ గేమ్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన హైలైట్ కానున్నాయి.

గతంలో ‘పిండం’ లాంటి విభిన్నమైన చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న సాయికిరణ్ రెడ్డి దైదా, ఈ ‘లెగసీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కలాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఇంటెన్స్ డ్రామాలో టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన భారీ తారాగణం భాగమైంది. రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, అనీష్ కురువిళ్ల తదితర సీనియర్ నటులతో పాటు ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రవి కాలే, అమిత్ తివారీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం, జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, జాషువా యాక్షన్ కొరియోగ్రఫీ ఈ పొలిటికల్ వార్ కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో శరవేగంగా జరుపుకుంటున్న ‘లెగసీ’.. 2026 డిసెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద తన పవర్ చూపించడానికి ముస్తాబవుతోంది.