Site icon NTV Telugu

Laila : బూతే బూతు కానీ నవ్వుల ట్రీట్.. లైలా ట్రైలర్ చూశారా?

Vishwak Sen Laila

Vishwak Sen Laila

విశ్వక్సేన్ హీరోగా రామనారాయణ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో లైలా అనే సినిమా తెరకెక్కుతోంది. సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించనుండడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా లైలా సినిమాను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఆద్యంతం నవ్విస్తూనే సాగింది.

Vyjayanthi Movies: వైజయంతి మూవీస్ కి…అతనికి సంబంధం లేదు!

మొదట సోను మోడల్‌ గా విశ్వక్ కనిపించగా లోకల్ ఎమ్మెల్యే చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం సోను అంటూ.. అతన్ని చంపాలని పలువురు సెర్చ్ చేస్తూ ఉంటారు. వారి నుంచి తప్పించుకోవడం కోసం లేడీ గెటప్ వేసుకొని లైలా గా మారతాడు విశ్వక్. ఇక లైలా నిజంగానే అమ్మాయి అనుకొని, ప్రేమ పేరుతో కొంత మంది మగ వారు వెంటపడుతూ ఉంటారు. ఈ క్రమంలో సాగే డైలాగ్ లతోనే నవ్వించారు. అయితే డబుల్ మీనింగ్ డైలాగ్ ల డోస్ తో బూతు కంటెంట్ ఎక్కువగానే ఉంది. “నీ ఛాతి చూశాక నా ఛాతి చపాతీ అయింది”, “నీది పువ్వు లేదు.. కాయ ఉన్నాయ్”, “కాయ లేదు, పండు ఉన్నాయ్.. పువ్వు లేదు, కాయ ఉన్నాయ్.” వంటి డైలాగ్ లు ట్రైలర్ లో ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.

Exit mobile version