‘మాస్ కా దాస్’ విష్వక్ సేన్ హీరో గా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘#కల్ట్’. ఈ సినిమాకు సందీప్ కాకరాల నిర్మాత. ఇందులో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కల్ట్ మూవీ అక్టోబర్ 30న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో విష్వక్ సేన్ మాట్లాడుతూ.. తన నటన గురువు తాజుద్దీన్‌కు క్షమాపణలు చెప్పారు. కల్ట్ సినిమాకు తానే దర్శకత్వం వహించడానికి కారణాన్ని కూడా వెల్లడించారు.
‘వరుసగా మూడు ఫ్లాప్‌లు ఎదుర్కొన్నా. ఫంకీ, లైలా, మెకానిక్ రాకీ నిరాశపర్చాయి. దాంతో కాస్త ఒత్తిడి, ఆందోళన నాలో నెలకొన్నాయి. నేను ఏమైనా తప్పు దారిలో వెళ్తున్నానా అనే సందేహం వచ్చింది. నా ఆయుధం నా చేతిలోనే ఉందని మా అన్న గుర్తు చేశారు. ఫలక్‌నుమా దాస్ సినిమా సమయంలో నా కోసం నేను ఎలా నిలబడ్డానో.. ఇప్పుడూ అలాగే నేనే నిలబడాలని అనుకున్నా. అందుకే కల్ట్ సినిమాని మొదలు పెట్టా. వాస్తవానికి తాజుద్దీన్‌ని దర్శకుడిగా అనుకున్నాం. ఆయన నా నట జీవితానికి గురువు. అయితే వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు ఆయనపై బాధ్యత వేయడం కరెక్ట్ కాదనిపించింది. నా చిత్ర బాధ్యతని నేనే తీసుకోవాలని అనుకున్నా. అందుకే ఈ సినిమాకు నేనే దర్శకత్వం వచించా. ఈ విషయంలో తాజుద్దీన్‌కు క్షమాపణలు చెప్తున్నా’ అని విష్వక్ సేన్ వివరించారు.
కల్ట్ సినిమాతో దాదాపు 150 మంది కొత్త నటీనటులు వెండి తెరకు పరిచయం కానున్నారని విష్వక్ సేన్ తెలిపారు. నటీనటులు, నిర్మాతలు ఇచ్చిన సహకారంతోనే ఈ సినిమాను సజావుగా చేయగలిగా అని పేర్కొన్నారు. సినిమా ప్రారంభమైన 5న నిమిషాల్లోనే ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తారు అని విష్వక్ సేన్ ధీమా వ్యక్తం చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అనిరుధ్ భాస్కర్, కార్తికేయ, ఇజి, తారక్, సందీప్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. దాంతో సినిపై మంచి బజ్ ఏర్పడింది.

