తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్, ఇప్పుడు ‘ఆర్యన్’ అనే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా, మేకర్స్ ఈ చిత్రం నుండి ‘ఐయామ్ ది గాయ్’ అనే పాటను విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటకు సామ్రాట్ సాహిత్యం అందించగా, జిబ్రాన్ మరియు శ్రీకాంత్ హరిహరన్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.
Also Read :Mouli : నువ్ కేక బాసూ.. రెండో సినిమాకే కోటి రెమ్యునరేషన్
‘ఆర్యన్’ చిత్రాన్ని అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ శ్రేష్ట్ మూవీస్ ద్వారా హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేయనున్నారు. గతంలో ‘విక్రమ్’, ‘అమరన్’, ‘థగ్ లైఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను పంపిణీ చేసిన శ్రేష్ట్ మూవీస్, ‘ఆర్యన్’ చిత్రాన్ని కూడా భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఈ చిత్రంలో విష్ణు విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారితో పాటు సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
విష్ణు విశాల్ గత చిత్రం ‘FIR’ కు దర్శకత్వం వహించిన మను ఆనంద్ ఈ చిత్రానికి సహ రచయితగా పనిచేయడం విశేషం. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శాన్ లోకేష్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్, ఆడియో లాంచ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.
