Vishnu Vishal: “నన్ను చేతకానివాడిగా చూశారు”.. ఆ సినిమాతో రూ.30 కోట్లు నష్టపోయానన్న హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Vishal: కోలీవుడ్ వైవిధ్యభరిత నటుడు విష్ణు విశాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, కొందరు తన మంచితనాన్ని ఎలా వాడుకున్నారో చెబుతూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గడిచిన మూడేళ్లలో నా జీవితంలో ఎన్నో చీకటి రోజులను చూశాను. ‘విష్ణు విశాల్ అంటే ఎలాగైనా వాడుకోవచ్చు, తను దేనికైనా ఓకే చెప్తాడు’ అనే స్థాయికి నన్ను తీసుకొచ్చారు. నా కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు, కనీసం దాని గురించి మాట్లాడలేదు” అని అన్నారు.
సినిమాపై ఉన్న పిచ్చితో తాను చేసిన ఒక త్యాగాన్ని విష్ణు విశాల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “ఎవరైనా ఏదైనా అడిగితే నేను వెంటనే సహాయం చేయడానికి ముందుంటాను. ఇటీవల వచ్చిన ‘ఇరందు వానం’ సినిమా కోసం అదనంగా మరో 80 రోజులు కేటాయించి నటించాను. అందుకోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కేవలం సినిమా బాగా రావాలి, సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే అలా చేశాను” అని చెప్పారు. “తర్వాత నేను ఒకసారి లెక్కలు వేసుకుని చూస్తే.. ఒక్క సినిమా వల్ల నేను దాదాపు రూ. 30 కోట్లు నష్టపోయాను. ఇదే విషయాన్ని ఆ చిత్ర డైరెక్టర్‌కి చెప్తే, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. పైగా నన్ను ఒక పరిస్థితిలో స్వార్థానికి వాడుకున్నారు. ‘విష్ణు అన్న ఏం చేసినా పడతాడు, ఏం అడిగినా చేస్తాడు’ అనే మైండ్‌సెట్‌లోకి వాళ్లు వచ్చేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇక చాలు.. నా మంచితనానికి ఒక ఫుల్స్టాప్ పెట్టాలి అనుకున్న క్షణం అదే. అదే నా జీవితంలో ‘చివరి దెబ్బ’ లాంటిది. అప్పుడే నేను మారాలని గట్టిగా నిర్ణయించుకున్నాను” అంటూ విష్ణు విశాల్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
తాజావార్తలు
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్‌కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!