Vishnu Vishal: “నన్ను చేతకానివాడిగా చూశారు”.. ఆ సినిమాతో రూ.30 కోట్లు నష్టపోయానన్న హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Vishal: కోలీవుడ్ వైవిధ్యభరిత నటుడు విష్ణు విశాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, కొందరు తన మంచితనాన్ని ఎలా వాడుకున్నారో చెబుతూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గడిచిన మూడేళ్లలో నా జీవితంలో ఎన్నో చీకటి రోజులను చూశాను. ‘విష్ణు విశాల్ అంటే ఎలాగైనా వాడుకోవచ్చు, తను దేనికైనా ఓకే చెప్తాడు’ అనే స్థాయికి నన్ను తీసుకొచ్చారు. నా కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు, కనీసం దాని గురించి మాట్లాడలేదు” అని అన్నారు.
సినిమాపై ఉన్న పిచ్చితో తాను చేసిన ఒక త్యాగాన్ని విష్ణు విశాల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “ఎవరైనా ఏదైనా అడిగితే నేను వెంటనే సహాయం చేయడానికి ముందుంటాను. ఇటీవల వచ్చిన ‘ఇరందు వానం’ సినిమా కోసం అదనంగా మరో 80 రోజులు కేటాయించి నటించాను. అందుకోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కేవలం సినిమా బాగా రావాలి, సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే అలా చేశాను” అని చెప్పారు. “తర్వాత నేను ఒకసారి లెక్కలు వేసుకుని చూస్తే.. ఒక్క సినిమా వల్ల నేను దాదాపు రూ. 30 కోట్లు నష్టపోయాను. ఇదే విషయాన్ని ఆ చిత్ర డైరెక్టర్‌కి చెప్తే, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. పైగా నన్ను ఒక పరిస్థితిలో స్వార్థానికి వాడుకున్నారు. ‘విష్ణు అన్న ఏం చేసినా పడతాడు, ఏం అడిగినా చేస్తాడు’ అనే మైండ్‌సెట్‌లోకి వాళ్లు వచ్చేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇక చాలు.. నా మంచితనానికి ఒక ఫుల్స్టాప్ పెట్టాలి అనుకున్న క్షణం అదే. అదే నా జీవితంలో ‘చివరి దెబ్బ’ లాంటిది. అప్పుడే నేను మారాలని గట్టిగా నిర్ణయించుకున్నాను” అంటూ విష్ణు విశాల్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!