Vishnu Priya : నేను అఖిల్‌కు భక్తురాలిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ హీరోయిన్లు, టీవీ యాంకర్స్ వారికి సంబంధించిన ప్రతి విషయం ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, క్రష్.. ఇలా ఏ విషయాన్నైనా చెప్పడానికి మొహమాట పడటం లేదు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా యంగ్ యాంకర్ విష్ణు ప్రియ తన మనసులో మాట బయటపెడుతూ యువ హీరోపై బోల్డ్ కామెంట్స్ చేసింది. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే పలు షార్ట్ ఫిలిమ్స్, యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది విష్ణు. ప్రజంట్ కొన్ని షోస్, స్పెషల్ ఈవెంట్లలో మాత్రమే కనిపిస్తున్న విష్ణు .. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కినేని అఖిల్ పై తన ఇంట్రెస్ట్ బయటపెట్టింది.
Also Read: Rashmika : రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు అటెండ్ అయ్యారు?
Also Read
ఇప్పటికే చాలాసార్లు అఖిల్ పై తన ఇష్టాన్ని బయటపెట్టింది విష్ణు ప్రియ. ఏ మాత్రం అవకాశం ఉన్నా అఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చింది. మనకు తెలిసి అఖిల్‌కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆ లిస్టులో విష్ణు ప్రియ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. అఖిల్ సినిమా విడుదలైంది అంటే విష్ణు ప్రియ హంగామా మొదలెడుతుంది. ఇక తాజాగా మరోసారి తన ఇష్టాన్ని పంచుకుంది విష్ణు.. ‘అఖిల్ తో డ్యాన్స్ చేసే ఒక్క అవకాశం వస్తే నా జీవితం ధన్యం అయిపోతుంది. రెమ్యునరేషన్ కూడా వద్దు నాకు అతనితో ఐటమ్ సాంగ్ అయిన ఒకే’ అంటూ చెప్పుకొచ్చింది. అసలు అఖిల్ అంటే ఎందుకు మీకు అంత పిచ్చి అనే మరో ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను పూర్వ జన్మ నుంచే ఆయన భక్తురాలిని అని, ఈ జన్మలో కూడా అదే కంటిన్యూ అవుతున్న’ అని చెప్పింది. ప్రస్తుతం విష్ణుప్రియ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!