ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కొందరి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీసులు మొత్తం 11 మంది మీద పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారని కేసు నమోదు చేశారు. హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి ప్రముఖ యూట్యూబర్ల మీద కేసు నమోదైంది. ఇక పోలీసుల విచారణలో, ఈ యూట్యూబర్లు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని తప్పుడు ఆశలు రేకెత్తిస్తున్నట్లు తేలింది.
Shocking: తాగుడుకు బానిసై, అనారోగ్యం బారిన టాలీవుడ్ స్టార్ హీరో?
ఇక బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై పంజాగుట్ట పోలీసులు కఠిన చర్యలకు దిగారు. ఈ విషయంలో భాగంగా పలువురికి నోటీసులు పంపిన పోలీసులు, విష్ణు ప్రియను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విచారణ కోసం రప్పించనున్నారు. అదే విధంగా బిగ్ బాస్ టేస్టీ తేజకు కూడా నోటీసులు అందజేసి, అతన్ని కూడా నేడు 4 గంటలకు హాజరవ్వాలని ఆదేశించారు. అయితే కొందరి మొబైల్ ఫోన్లు ఆఫ్‌లో ఉండటం గమనార్హం. అంతేకాక, ఈ రోజు మరికొంతమందికి నోటీసులు జారీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.