Site icon NTV Telugu

Betting Apps case : హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ..

Vishnu Priya

Vishnu Priya

తాజాగా బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ చేసిన వారిపై, తెలంగాణ ప్రభుత్వం పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లలో పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో బెట్టింగ్‌లపై నిషేధం ఉన్న సంగతి తెలిసినప్పటికి బెట్టింగ్‌ నిర్వాహకులు మాత్రం వేర్వేరు పేర్లతో ఎప్పటికప్పుడు రంగులు మార్చుతూ బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు.  వీరి మాటలు నమ్మి దాదాపు 980 మంది యాప్‌ ద్వారా మోసపోయి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయింది.  ఇందులో పలువురు టాలీవుడ్ హీరోలు కూడా ఉండగా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో  మొత్తం 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో కొంత మందిని విచారానకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో విష్ణుప్రియ, రీతూ చౌదరి ఇటీవల పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, ఇవాళ (ఈనెల 25న) మరోసారి విచారణకు రావాలని పోలీసులు వారికి సూచించారు.

Also Read; Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ అనారోగ్యంతో మృతి…

ఇవాళ కూడా పంజాగుట్ట పోలీసుల ఎదుట మరోసారి విచారణకు విష్ణుప్రియ హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో, ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విష్ణు ప్రియ.. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు FIR లను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ పెట్టింది. కాగా నేడు విష్ణు ప్రియ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది.

Exit mobile version