NTV Telugu Site icon

Bigg Boss 8 : బిగ్ బాస్ లోకి విష్ణు ప్రియ, రీతూ.. ఇలా లీక్ చేశారేంటి?

Vishnupriya Rithu Chow

Vishnupriya Rithu Chow

Vishnu Priya and Rithu Chowdary to enter Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హడావుడి మొదలైపోయింది ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలామంది హౌస్ లోపలికి వెళ్ళబోతున్నారు అనే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. అయితే తాజాగా హౌస్ లోకి వెళుతున్నట్లు లీక్ ఇచ్చారు ఇద్దరు హాట్ భామలు. భీమినేని విష్ణుప్రియ అలియాస్ యాంకర్ విష్ణుప్రియ అలాగే నటి రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిలో ఒకరు యాంకరింగ్ ద్వారా తన సత్తా చాటుకుంటే మరొకరు నటన ద్వారా సత్తా చాటి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా కుర్రకారుని ఒక ఊపు ఊపుతున్నారు. ఈ ఇద్దరు కలిసి ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Himanta Biswa Sarma: రోహింగ్యాల చొరబాట్లపై బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల మెతక వైఖరి.. భారత్‌కి ముప్పు..

తాజాగా స్టార్ మా లో ప్రసారమవుతున్న ఒక ప్రోగ్రాం కోసం ఎన్టీవీ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కి వెళ్లే విషయం గురించి స్పందించారు. ముందుగా ఈ ఇద్దరూ కలిసి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతోంది దీని మీద మీ స్పందన ఏమిటి అని అడిగితే విష్ణు ప్రియ మాట్లాడుతూ నేను ఈమధ్య ఒక పది కిలోల బరువు పెరిగాను. బిగ్బాస్ కి వెళితే ఆ 10 కిలోలు తగ్గుతానని నమ్మకం ఉంది. అయితే ఎంతోమంది ప్రేక్షక మూర్తుల దీవెనల వల్ల వెళ్తానేమోనని భయంగా ఉంది. నాకైతే పర్సనల్గా వెళ్లడం ఇష్టం లేదు కానీ వాళ్ళు మమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలి అనుకుంటున్నారు వాళ్ళ ప్రేయర్స్ విని తథాస్తు దేవతలు తధాస్తు అంటే డెఫినెట్లీ మీరు నన్ను హౌస్ లో చూడొచ్చు అని అన్నారు. ఇక మీరేం చెబుతారని రీతూ చౌదరిని అడిగితే నేను కూడా విష్ణు ప్రియ మాటలు కాపీ పేస్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేవాళ్లు మామూలుగా ఇలాంటి విషయాలు చాలా సీక్రెట్ గా ఉంచుతారు కానీ వీళ్ళు ఇంత ఓపెన్ గా చెబుతున్నారంటే వెళ్లడం నిజం కాదేమో అనే ప్రచారం కూడా ఉంది చూడాలి మరి ఏమవుతుంది అనేది.

Show comments