Site icon NTV Telugu

Vishnu : ‘కన్నప్ప’ స్క్రిప్ట్‌‌ని తెలుగు డైరెక్టర్స్ రిజక్ట్ చేశారు.. కుండ బద్దలు కొట్టిన విష్ణు

Mancu Vushnu

Mancu Vushnu

విశ్వసనీయమైన పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కిన ‘కన్నప్ప’ సినిమా, మంచి విజయాన్ని సాధించడంతో హీరో మంచు విష్ణు ఆనందోత్సాహంతో మీడియా ముందుకు వచ్చాడు. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన్ను పలువురు విలేకరులు ప్రశ్నించగా, ఆయన పూర్తి స్పష్టతతో మాట్లాడారు. ముఖ్యంగా, ఈ భారీ తెలుగు చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఎందుకు ఎంచుకున్నారు? అనే ప్రశ్నకు ఆయన కుండ బద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు.

Also Read : Shraddha : బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన శ్రద్ధా కపూర్ పోస్ట్..

‘నా గత సినిమాల ఫలితాలు అందరికీ తెలుసు. ఆ ట్రాక్ రికార్డ్‌తో ‘కన్నప్ప’ స్క్రిప్ట్‌ పట్టుకుని ఎంత మంది తెలుగు దర్శకులను కలిసినా, ఎవ్వరూ నాతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు రాలేదు. అందుకే బాలీవుడ్ వైపు చూడాల్సి వచ్చింది’ అని బహిరంగంగా తెలిపారు. అయితే ఈ విషయంలో ఆవేదన కన్నా నిజాయితీ ఎక్కువగా కనిపించింది. ‘మహాభారతం’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ముఖేష్ కుమార్ సింగ్ ని చూసిన వెంటనే ఆయన విజన్ ఏంటో తెలిసింది. ఆ నమ్మకమే ఇప్పుడు ఫలిస్తోంది అన్నారు. ‘కన్నప్పకు మొదటి రోజే భారీ ఓపెనింగ్ రావడానికి ప్రభాస్ క్యామియో ప్రధాన కారణమని నేను ముమ్మాటికి ఒప్పుకుంటా..ఇరవై నిమిషాల ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమా రేంజ్ పెరిగింది. అయితే, మిగిలిన కథా బారం మాత్రం నేను మోసాను. ఇది నా కోసం గొప్ప ఛాలెంజ్. నాకు ఈగోలు లేవు, సక్సెస్ వెనుక అందరి కృషి ఉంది. పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇది ఒక్కరి మీద కాదు, మొత్తం టీమ్ మీద నమ్మకంతో వచ్చిన విజయం’ అన్నారు విష్ణు.

Exit mobile version