Site icon NTV Telugu

విశాల్ “ఎనిమీ” టీజర్ రిలీజ్ డేట్

Vishal's Enemy teaser release date is confirmed!

తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో ఆర్య, ప్రకాష్ రాజ్, మృణాలిని రవి, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నటుడు ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఆనంద్ శంకర్ రచన, దర్శకత్వం వహించగా… ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ “ఎనిమీ” టీజర్ ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే ఇది కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా జూన్ 20న “ఎనిమీ” టీజర్ విడుదల కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కొంతభాగం తప్ప దాదాపు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. విషయం తన 31వ చిత్రం షూటింగ్ పూర్తి చేశాక “ఎనిమీ” షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు. ఇక ఈ ఏడాదిలోనే 2 సినిమాలతో విశాల్ ప్రేక్షకులను అలరించనున్నాడు. “ఎనిమీ” ఆగస్టులో, “విశాల్ 31” క్రిస్మస్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version